News February 15, 2025

రాజమండ్రి: దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

image

బిక్కవోలు కేంద్రంగా దోంగ నోట్లును ముద్రిస్తున్న ఐదుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ.. దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా నుంచి 1.07 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేశామన్నారు. బిక్కవోలుకు చెందిన మెకానిక్ నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నకిలీ నోట్ల గుట్టురట్టు చేశారు.

Similar News

News February 20, 2026

రాజమండ్రి: ‘లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారమే లక్ష్యం’

image

మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మీ గంధం సునీత సమావేశమయ్యారు. ఈ అదాలత్‌లో గరిష్ఠ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు. రాజీ పడదగిన ఎక్సైజ్ కేసులను గుర్తించి, ఆ జాబితాను న్యాయ సేవాధికార సంస్థకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

News February 20, 2026

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: డీఎస్పీ

image

ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా లేదా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయాలని రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమార్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు ప్రజలు భాగస్వాములు కావాలని, నేరుగా ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

News February 20, 2026

తూ.గో: ‘క్వింటా శనగలు రూ.5,875కే కొనుగోలు’

image

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా తూ.గో జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర క్వింటా రూ.5,875 చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ దేవరపు ప్రతాప్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా RBK వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు RBK కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.