News February 15, 2025
WGL: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్, సంగంరెడ్డి సుందర్ రాజ్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News November 15, 2025
ఆర్చరీ క్రీడాకారులను అభినందించిన జేసీ

భీమవరం కలెక్టరేట్‌లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్కూల్ గేమ్స్ అండర్ 14,17 విభాగాల్లో ఆర్చరీ పోటీల్లో రాష్ట్ర స్థాయి బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా జేసీ ఆర్చరీలో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని అన్నారు.
News November 15, 2025
పాలమూరు: పీయూలో యాంటీ ర్యాగింగ్ అవగాహన

పాలమూరు విశ్వవిద్యాలయం లైబ్రరీ ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, బీఎఎస్ చట్టంలోని కఠిన సెక్షన్ల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా డి మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News November 15, 2025
పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.


