News February 15, 2025
WGL: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్, సంగంరెడ్డి సుందర్ రాజ్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News January 11, 2026
రేపు మదనపల్లిలో స్పందన కార్యక్రమం

అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు సోమవారం మదనపల్లిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానిక DSP కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా SP ధీరజ్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ సమస్యలకు సంబంధించిన అర్జీతో మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి రావాలని పోలీసులు సూచించారు.
News January 11, 2026
కృష్ణా: కోడి పందేలలో గోదావరి జిల్లాలను తలదన్నేలా.?

సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలు.. కోడి పందేలు అంటేనే గోదావరి జిల్లాలు. అయితే గత కొన్నేళ్లు గోదావరి జిల్లాలను తలదన్నే విధంగా కృష్ణా జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో కోడి పందేలు వేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు, గన్నవరం మండలం అంబాపురం, గుడ్లవల్లేరు మండలం వేమవరం వద్ద అతిపెద్ద బరులను ఏర్పాటు చేస్తున్నారు.
News January 11, 2026
సంక్రాంతి ఎఫెక్ట్.. గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ట్రైన్ నంబర్ 07477/07478 చర్లపల్లి నుంచి అనకాపల్లికి, తిరుగు ప్రయాణంలో అనకాపల్లి నుంచి చర్లపల్లికి నడవనున్నాయి. ఈ రైళ్లు గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ట్రైన్ నంబర్ 07479 అనకాపల్లి నుంచి చర్లపల్లికి మరుసటి రోజు అందుబాటులో ఉంటుందని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.


