News February 15, 2025

మార్చిలోపు ఆ ఆస్తుల లెక్కలు తేల్చండి: బండి

image

TG: ‘ఎనిమీ ప్రాపర్టీస్’పై అధికారులతో కేంద్రమంత్రి బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. భారత్ నుంచి వెళ్లి పాక్, చైనాలో స్థిరపడ్డవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. మార్చిలోపు లెక్కలు తేల్చాలన్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఈ ఆస్తులున్నట్లు గుర్తించారు. పాక్, చైనాలో సెటిలైన భారతీయుల ఆస్తులను కేంద్రం ఎనిమీ ప్రాపర్టీస్ చట్టం కింద స్వాధీనం చేసుకుంటుంది.

Similar News

News November 11, 2025

జంక్ ఫుడ్ తింటున్నారా?

image

అల్ట్రా-ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ (కూల్ డ్రింక్స్, చిప్స్, ప్యాకేజ్డ్ మాంసం) కేవలం బరువు పెంచడమే కాకుండా మెదడుకు తీవ్ర హాని కలిగిస్తుందని హెల్సింకి యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే 30 వేల మంది బ్రెయిన్స్ స్కాన్ చేయగా సెల్స్ డ్యామేజ్ & వాపు వంటి మార్పులు కనిపించాయి. ఇవి మెదడును తిరిగి ప్రోగ్రామింగ్ చేసి, అదే చెత్త ఆహారాన్ని పదేపదే కోరుకునేలా చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

News November 11, 2025

దేశంలో మహిళలే అసలైన మైనారిటీలు: SC

image

పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై SC కేంద్రానికి నోటీసులు జారీచేసింది. తాజా డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు జయా ఠాకూర్ (CONG) దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్‌లు నాగరత్న, మహదేవన్‌ల బెంచి విచారించింది. ‘పౌరులందరికీ సమానత్వం ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. మహిళలు 48% ఉన్నా రాజకీయ సమానత్వంపై చర్చ నడుస్తోంది. అసలైన మైనారిటీలు వారే’ అని వ్యాఖ్యానించింది.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు

image

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో పేలుడు ఘటన షాక్‌కు గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.