News February 15, 2025
కేసీఆర్‌కు పట్టిన గతి రేవంత్‌కు పడుతుంది: ఎంపీ లక్ష్మణ్

TG: ప్రధాని మోదీ కులంపై సీఎం <<15461493>>రేవంత్ చేసిన వ్యాఖ్యలపై<<>> బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ భాష చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఇలాగే మాట్లాడి ఇంటికి వెళ్లారని దుయ్యబట్టారు. రేవంత్‌కు కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు.
Similar News
News February 19, 2025
శివాజీ చెప్పిన కొన్ని కోట్స్

ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని కొటేషన్స్ మీకోసం. స్వేచ్ఛ అనేది ఒక వరం, దీనిని ప్రతి ఒక్కరూ పొందే హక్కు ఉంది. స్త్రీలకున్న హక్కుల్లో గొప్పది తల్లికావడమే. మీరు మీ లక్ష్యాలను ప్రేమించడం ప్రారంభించినప్పుడు, మీకు అడ్డంకులు కనిపించవు ముందున్న మార్గం మాత్రమే కనిపిస్తుంది. మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు, పర్వతం కూడా మట్టి కుప్పలా కనిపిస్తుంది.
News February 19, 2025
మాజీ క్రికెటర్ మృతి

ఫస్ట్ క్లాస్ క్రికెటర్, ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ రేగే(76) కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. సునీల్ గవాస్కర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం మిలింద్ MCAకు అడ్వైజర్‌గా ఉన్నారు. 26 ఏళ్ల వయసప్పుడే హార్ట్ ఎటాక్‌కు గురైన ఆయన అప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మిలింద్ ముంబై తరఫున 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 126 వికెట్లు పడగొట్టారు. ఆయన మరణంతో MCA విషాదంలో మునిగిపోయింది.
News February 19, 2025
2027లో ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా రిలీజ్

ఛత్రపతి శివాజీ జీవితంపై ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే సినిమా తెరకెక్కనుంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తుండగా సందీప్ సింగ్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. శివాజీ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవితంపై తెరకెక్కిన ‘ఛావా’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.