News February 15, 2025

యాదాద్రి: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News November 13, 2025

ఇండియా A విజయం

image

సౌతాఫ్రికా Aతో జరిగిన తొలి అనధికార వన్డేలో ఇండియా A విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 285 రన్స్ చేసింది. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (117) సెంచరీతో అదరగొట్టారు. తిలక్ వర్మ 39, నితీశ్ 37, అభిషేక్ శర్మ 31 రన్స్ చేశారు.

News November 13, 2025

BHPL: ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలి!

image

భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ అభివృద్ధి అధికారి ఇందిర తెలిపారు. ఏడాదికి రూ.4వేల మంజూరు కొరకు డిసెంబర్ 15లోగా https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 13, 2025

కీలక ప్రాంతాల రక్షణ మహిళా DCPల చేతుల్లోనే!

image

HYD, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 16 జోన్లలో 7 జోన్లకు ప్రస్తుతం మహిళా డిప్యూటీ కమిషనర్‌‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ అధికారులు సౌత్ జోన్- స్నేహ మెహ్రా, మాదాపూర్ ఐటీ కారిడార్- కే.శిల్పవల్లి, కీలకమైన ఇంటెలిజెన్స్ వింగ్ వంటి సున్నితమైన, ప్రముఖ ప్రాంతాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది నగర పోలీసింగ్‌లో మహిళల ప్రాతినిధ్యం మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.