News February 15, 2025

పరీక్షలపై విద్యార్థులకు సద్గురు సూచనలు

image

ఇతరుల ప్రతిభతో పోల్చుకుని మనల్ని తక్కువ చేసుకోరాదని ఎవరి ప్రతిభ వారికే ప్రత్యేకమని సద్గురు జగ్గీవాసుదేవ్ తెలిపారు. ‘పరీక్షా పే చర్చ’లో భాగంగా స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వినియోగం పై విద్యార్థులకు సూచనలిచ్చారు. పరీక్ష ఫలితాలనేవి పై చదువులకు అర్హతలుగానే భావించాలని వాటి గురించి అతిగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇంటర్నెట్‌ను సరిగ్గా వినియోగిస్తే సమాచార సేకరణకు ఎంతో ఉపయోగకరమన్నారు.

Similar News

News July 6, 2025

ఆ చిన్నారే ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ..

image

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ ఫస్ట్ <<16964615>>గ్లింప్స్<<>> తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె ఎవరో కాదు చియాన్ విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన చిన్నారి. బాలనటిగా పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు యాడ్స్‌లోనూ మెరిశారు. హీరోయిన్‌గా తొలి సినిమానే స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. ఆమె నాన్న రాజ్ అర్జున్ కూడా నటుడే.

News July 6, 2025

F-35B గురించి తెలుసా?

image

Lockheed Martin అనే US కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఐదో తరం <<16919199>>F-35B<<>> యుద్ధవిమానాన్ని UK కొనుగోలు చేసింది. ఇది గంటకు 1,975KM వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ అయ్యేందుకు 500 ఫీట్ల రన్ వే సరిపోతుంది. కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ వాడటం వల్ల రాడార్లు దీన్ని గుర్తించలేవు. ఫలితంగా శత్రు దేశానికి తెలియకుండా దాడులు చేయవచ్చు. ఇది జూన్ 14న తిరువనంతపురం (కేరళ)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

News July 6, 2025

విజయానికి 5 వికెట్లు

image

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఐదో రోజు భారత బౌలర్ ఆకాశ్‌దీప్ అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లకే రెండు కీలక వికెట్లు తీశారు. పోప్(24), బ్రూక్(23)ను ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ 4 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ENG స్కోరు 83/5. ఇంకా 5 వికెట్లు తీస్తే భారత్‌దే విజయం.