News February 15, 2025
పోరాటయోధుడు ధర్మభిక్షం

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన జయంతి.
Similar News
News October 30, 2025
మిర్యాలగూడ: చివరి ధాన్యం గింజ వరకూ కొంటా: కలెక్టర్

ఈ ఖరీఫ్‌లో రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. గురువారం రైస్ మిల్లు తనిఖీ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని తెలిపారు. రైస్ మిల్లర్లు ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని దించుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆమె అన్నారు.
News October 30, 2025
ధాన్యం తడవకుండా పటిష్ఠ చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

మాడుగులపల్లి: మొంథా తుపాను నేపథ్యంలో వర్షాలకు ధాన్యం తడవకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జులను ఆదేశించారు. గురువారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి ఆమె మాడుగులపల్లి మండలం చిరుమర్తిలోని ఐకేపీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులతో సమన్వయం చేసుకొని, టార్పాలిన్లు, లారీలు సిద్ధం చేయాలని డీఆర్‌డీఓ శేఖర్ రెడ్డికి సూచించారు.
News October 30, 2025
NLG: ధాన్యం తడవడంతో సెంటర్ ఇన్‌ఛార్జికి షోకాజ్

తిప్పర్తి మార్కెట్ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల తుఫాను వర్షాలకు కేంద్రంలోని ధాన్యం తడవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకుగాను సెంటర్ ఇన్‌ఛార్జికి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆమె ఆదేశించారు.


