News February 15, 2025

రహదారి భద్రత నిరంతర ప్రక్రియ: కలెక్టర్

image

రహదారి భద్రత నిరంతర ప్రక్రియ అని, వాహనదారులందరూ నిత్యం రహదారి నియమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల 2025 ముగింపు సమావేశాన్ని ఆయన ఆటో డ్రైవర్లు, వివిధ కళాశాలల విద్యార్థులతో నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం వలన ప్రమాదాలను నివారించవచ్చన్నారు.

Similar News

News September 18, 2025

సంగారెడ్డి: ఉపాధ్యాయులను భర్తీ చేయాలని వినతి

image

జిల్లాలో ఉపాధ్యాయ ప్రమోషన్‌తో మిగిలిపోయిన పోస్టులను తదుపరి సీనియార్టీ జాబితాతో భర్తీ చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డీఈవో వెంకటేశ్వర్లకు గురువారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

News September 18, 2025

మంచిర్యాల: ‘మేదరి కులస్థులకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి’

image

మంచిర్యాల పట్టణంలో గురువారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురుతో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. అనంతరం మేదరి మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు సూరినేని కిషన్ మాట్లాడుతూ.. కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మేదరులకు రాష్ట్ర ప్రభుత్వం వెదురు బొంగులు ఉచితంగా సరఫరా చేయాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కోరారు.

News September 18, 2025

ఆందోల్: మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి: మంత్రి

image

నిలోఫర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి దామోదర్ రాజానర్సింహా పేర్కొన్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పటిష్ఠ పర్చాలని మంత్రి దిశానిర్దేశం చేసారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ, ఎండీ తదితరులు పాల్గొన్నారు.