News February 15, 2025
పోరాటయోధుడు ధర్మభిక్షం

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన జయంతి.
Similar News
News April 18, 2026
సర్వీస్ ఇనామ్ భూములకు విముక్తి

AP: గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ భూములకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించింది. రాష్ట్రంలో 1,36,024 ఎకరాలను ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, నిషేధ జాబితా 22(A) నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో వీటి క్రయ, విక్రయాలకు, రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించనుంది. అవి పట్టా భూములుగా రికార్డుల్లో ఉంటాయి.
News April 18, 2026
కాకినాడను కాపాడుతుంది ఇదే..!

కాకినాడకి ‘హోప్ ఐలాండ్’ ఒక సహజ రక్షణ కవచంలా నిలుస్తోంది. సముద్రపు పెను తుపానుల నుంచి నగరాన్ని కాపాడుతున్న ఈ దీవి వల్లే కాకినాడ రేవు సురక్షితంగా ఉంది. 1839 నాటి ప్రళయం నుంచి నేటి వరకు ఈ దీవి రక్షణగా నిలవడంతోనే పోర్ట్ ‘కామ్ వాటర్’గా గుర్తింపు పొందింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు నిలయమైన ఈ దీవి లేకపోతే కాకినాడ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయేదని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
News April 18, 2026
రాజమండ్రి జైలు గోడల వెనుక చీకటి చరిత్ర

1602లో డచ్ వారు నిర్మించిన రాజమండ్రి కోట కేవలం వస్త్రాల వ్యాపారానికే పరిమితం కాలేదు. ఇండోనేషియాకు ఇక్కడ నుంచి బానిసలను సరఫరా చేసే చీకటి చరిత్ర కూడా ఉంది. దాదాపు 30,000 మందిని ఇక్కడి నుంచి తరలించినట్లు చరిత్రకారుల అభిప్రాయం. 1857లో దీనిని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకునే వరకు ఇది డచ్ వారి ప్రధాన వ్యూహాత్మక కేంద్రంగా ఉండేది. నేటి సెంట్రల్ జైలు గోడల వెనుక నాటి డచ్ కోట ఆనవాళ్లు ఇంకా సజీవంగా ఉన్నాయి.


