News March 20, 2024
ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదు

పలువురికి ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. యాప్ ఓపెన్ చేయగానే ఇమేజ్ లోడ్ అవ్వట్లేదని చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 20%కి పైగా యూజర్లు సమస్యలు ఎదురవుతున్నట్లు Xలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ సేవలు దాదాపు గంట పాటు నిలిచిపోయాయి. మరి మీకు కూడా ఈ సమస్య వస్తోందా? కామెంట్ చేయండి.
Similar News
News April 4, 2025
పిల్లలకు SM నిషేధ అంశం పార్లమెంట్ పరిధిలోనిది: సుప్రీంకోర్టు

13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది పాలసీ అంశమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై చట్టం చేయాలని పార్లమెంట్‌నే కోరాలని సూచించింది. పిటిషనర్లు సంబంధిత విభాగానికి అర్జీ చేసుకుంటే 8 వారాల్లో పరిష్కరించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.
News April 4, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు రవి కుమార్(71) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1968లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవికుమార్ 150కిపైగా మలయాళ, తమిళ చిత్రాలు, అనేక సీరియళ్లలో నటించారు. ‘అనుబంధం’ సీరియల్‌తో పాటు రజినీకాంత్ శివాజీ మూవీలో మినిస్టర్ పాత్రతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
News April 4, 2025
ఒకేసారి ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రాయితీ

AP: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30లోగా చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.