News February 15, 2025

మహిళా క్రికెటర్‌కు హీరో శివ కార్తికేయన్ సాయం!

image

తాము కష్టాల్లో ఉన్నప్పుడు సినీ నటుడు శివ కార్తికేయన్ చేసిన సాయాన్ని భారత మహిళా క్రికెటర్ ఎస్ సంజన గుర్తు చేసుకున్నారు. ‘2018 వయనాడ్ వరదల్లో ఇళ్లు కోల్పోయాం. నా ట్రోఫీలు, క్రికెట్ కిట్ కొట్టుకుపోయాయి. అప్పుడు శివ కార్తికేయన్ కాల్ చేసి హెల్ప్ కావాలా అని అడిగారు. కొత్త స్పైక్స్ కావాలని అడిగిన వారంలోనే అవి నా చెంతకు చేరాయి. అప్పుడు నా చుట్టూ ఎంత మంది మద్దతుదారులున్నారో తెలిసింది’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News April 17, 2026

‘కాళేశ్వరం’పై ఎలాంటి దురుద్దేశమూ లేదు: మంత్రి

image

TG: ₹97,000CRతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకురావాలా అని ఆలోచనలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ‘కాళేశ్వరం నిర్మాణంలో BRS చేసిన తప్పిదాలు ప్రజలకు తెలుసు. ఈ ప్రాజెక్టుపై మాకెలాంటి దురుద్దేశమూ లేదు. గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్, డిజైన్లు పూర్తిచేయాలని నిర్ణయించాం’ అని వివరించారు. NDSA ఛైర్మన్‌తో వీటిపై చర్చించామని తెలిపారు.

News April 17, 2026

APPLY NOW: 350 బ్యాంక్ ఉద్యోగాలు

image

ఇండియన్ బ్యాంక్‌లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్, క్రెడిట్, రిస్క్, HRలో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి ఉద్యోగాలు దీనిలో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 28. బీటెక్, MCA, MBA, CA, ఏదైనా పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం https://indianbank.bank.in/career/ చూడండి.

News April 17, 2026

కాసేపట్లో మహిళా బిల్లుపై ఓటింగ్.. అందరూ మద్దతివ్వండి: మోదీ

image

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంపీలందరూ మద్దతు ఇవ్వాలని PM మోదీ కోరారు. కాసేపట్లో ఓటింగ్ జరగనుందని, ఓటు వేసే ముందు ప్రతి సభ్యుడూ వారి తల్లి, సోదరి, భార్య, కూతురును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. మహిళలను గౌరవించడానికి ఇదొక గొప్ప అవకాశమని ట్వీట్ చేశారు. ఈ సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా దేశంలోని మహిళా శక్తి, ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.