News February 15, 2025

ఎల్బీనగర్‌లో పోలీసుల కష్టాలు! (PHOTO)

image

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.

Similar News

News November 7, 2025

విద్యాసంస్థలకు రేపు సెలవు లేదు: డీఈవో

image

మొంథా తుఫాన్ ప్రభావం వల్ల కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత నెల 29న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు రెండో శనివారం సెలవు ఉన్నప్పటికీ విద్యా సంవత్సరంలో పనిదినాలు అమలుపరచడంలో భాగంగా రేపు అన్ని స్కూళ్లు ఉంటాయని డీఈవో శామ్యూల్ పాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఈఓలు, హెచ్ఎంలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News November 7, 2025

రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో CBN

image

సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు. కాగా గత వారం పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన సమయంలో ఇక ప్రతివారం ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News November 7, 2025

గుంటూరు జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

image

రహదారి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కాజా టోల్గేట్, తాడికొండ అడ్డరోడ్డు, పేరేచర్ల, నారాకోడూరు, నందివెలుగు రోడ్డు, వాసవి క్లాత్ మార్కెట్, చుట్టుగుంట ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 78 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటూ రూ. 7,79,720 జరిమానా విధించామని SP వకుల్ జిందాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అంబులెన్స్ సీజ్ చేశామన్నారు.