News February 15, 2025
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తపాలా బ్యాలెట్‌కు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఫిబ్రవరి 27న జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే సిబ్బంది వారి ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చునన్నారు. ఆయా ఎన్నికల అధికారులు గమనించాలన్నారు తెలిపారు.
Similar News
News April 19, 2026
తిరుమల శ్రీవారికి ‘రూ.కోటి’ విరాళం ఇస్తే.!

☞దాతతోపాటు నలుగురు ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజులు సుపథం ప్రవేశ దర్శనం పొందవచ్చు ☞అంతేకాకుండా 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట-1, రవికె-1, మహాప్రసాదం ప్యాకెట్లు-10, ఒకసారి వేద ఆశీర్వచనం పొందవచ్చు ☞వీటితోపాటు రూ.3 వేల విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పిస్తారు ☞జీవిత కాలంలో ఒకసారి దాత 5గ్రా. శ్రీవారి బంగారు డాలర్, 50 గ్రా.సిల్వర్ డాలర్ పొందవచ్చు.
News April 19, 2026
కామారెడ్డి జిల్లా గరం.. గరం

కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మద్నూరు మండలం మేనూరులో 44.2°Cల అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్పంగా రాజంపేట మండలం ఆర్గొండలో 41°C రికార్డు అయ్యింది. జిల్లాలోని 32 వెదర్ స్టేషన్‌లలో అన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు అధికారులు వెల్లడించారు. రోజురోజుకు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News April 19, 2026
నల్గొండ: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

రైలు కింద పడి ఓ గుర్తుతెలియని మహిళ(55) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి చిట్యాల – శ్రీరాంపురం మధ్య గోపలాయపల్లి వద్ద చోటుచేసుకుంది. సికింద్రాబాద్ – హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కింద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ అభినవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు 87126 58595 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.


