News February 15, 2025
ఖమ్మం మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి: కవిత

ఖమ్మం జిల్లాకు పేరుకే ముగ్గురు మంత్రులు, కానీ అభివృద్ధిలో శూన్యమని, వారు వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్‌లో ఆమె మాట్లాడుతూ.. బనకచర్ల పర్మిషన్ ఇస్తే ప్రజలు చాలా నష్టపోతారన్నారు. కళ్ల ముందు నీళ్లు వెళ్తున్నా.. ఉపయోగించుకోలేక పోతున్నామని చెప్పారు. మంత్రి తుమ్మల చాలా సీనియర్, ఆనాడు ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ఎంత కష్టపడ్డారో ఆయనకు తెలుసని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2026
WGL: ఎమ్మెల్యేలకు వీడిన టెన్షన్!

పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో ప్రస్తుత MLAలు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు తోడుగా మరో 6-7 నియోజకవర్గాలు కొత్తగా వస్తాయని, ఇప్పుడున్న రిజర్వేషన్లు మారుతాయని ప్రచారం జరిగింది. కొందరు నాయకులు ఈ MLA మనకు ఉండరనే ఉద్దేశంతో మరో నేత దగ్గరకు వెళ్లిన వారున్నారు.కాగా ప్రస్తుత రిజర్వేషన్లే మళ్లీ ఉండటంతో తిరిగి MLAల దగ్గరకే రావాల్సిన పరిస్థితి లీడర్లకు ఏర్పడింది.
News April 18, 2026
‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
News April 18, 2026
సంబేపల్లెలో గురుకుల విద్యార్థిని మృతి

సంబేపల్లె మండలం ఎర్రగుంట్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదువుతున్న రెడ్డిరాణి 14 (9వ తరగతి) విద్యార్థి శనివారం తెల్లవారుజామున మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థినికి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండడంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతి చెందినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


