News February 15, 2025

పెద్దపల్లి: అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష

image

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో పెద్దపల్లి కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వేణు సమీక్షించారు. గంజాయితో పాటు గుడుంబా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారికి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. గోదావరిఖనిలో 10 పడకల డీఅడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏసీపీ కృష్ణ, రమేశ్, DAO ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 4, 2025

IIIT విద్యార్థుల జాబితా విడుదల

image

TG: 2025-26 విద్యా సంవత్సరానికి IIITలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇన్‌ఛార్జ్ వీసీ విడుదల చేశారు. 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 1,690 మందిని ఎంపిక చేశారు. విద్యార్థులకు టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక జరగ్గా, 88శాతం సీట్లు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారికే దక్కాయి. ఎంపికైన విద్యార్థులకు జులై 7, 8, 9 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. <>లింక్<<>> ఇదే.

News July 4, 2025

ములుగు జిల్లాలో పేలిన మందుపాతర

image

ములుగు జిల్లాలో మరోసారి మందుపాతర పేలింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెంకటాపురం మండలం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని చెలిమల గుట్టలపై శుక్రవారం మందుపాతర పేలింది. ఈ ఘటనలో పాత్రపురం పంచాయతీ ముకునూరు పాలెం గ్రామానికి చెందిన వృద్ధుడు సోయం కామయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 4, 2025

కరీంనగర్: బయట ఫుడ్ తింటున్నారా..? బీ కేర్ ఫుల్

image

KNR, జ్యోతినగర్‌లోని రాజుగారి బిర్యానీ అడ్డా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి ఈరోజు తనిఖీ చేశారు. ఒక ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు జరిగాయి. కిచెన్, ఫ్రీజర్‌లో ముందురోజు మిగిలిపోయిన 17KGల వండిన చికెన్‌, కార్న్, ఇతర కూరగాయలు, వస్తువులను గుర్తించి ధ్వంసంచేశారు. చికెన్ ఐటమ్స్‌లో కృత్రిమరంగులు వాడినందుకు నోటీసులు జారీచేశారు. మాంసాహార ముడిపదార్థాలపై తప్పనిసరిగా తేదీ, లేబుల్ వేయాలని ఆదేశించారు.