News February 15, 2025
రామ్ చరణ్‌తో మూవీ చేయట్లేదు: బాలీవుడ్ డైరెక్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీయబోతున్నారనే ప్రచారాన్ని బాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ ‘కిల్’ డైరెక్టర్ నిఖిల్ నగేశ్ ఖండించారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను కొత్త స్టోరీతో త్వరలోనే సినిమా చేస్తానని తెలిపారు. వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఇందులో కథ చెప్పే విధానంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తానని పేర్కొన్నారు.
Similar News
News October 25, 2025
బాబా ఫరీద్ యూనివర్సిటీలో 348 ఉద్యోగాలు

పంజాబ్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ 348 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 40 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://recruitment.ggsmch.org/
News October 25, 2025
ఏఐ ఫేక్ వీడియో, ఇమేజ్లపై ECI ఆదేశాలు

బిహార్ ఎన్నికల్లో AIవీడియోలు, ఇమేజ్‌లతో ప్రచారాలు మిన్నంటాయి. వీటిలో కొన్ని ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఉండటంతో EC కొత్త రూల్స్ ప్రకటించింది. వీడియో, ఇమేజ్‌ల పైభాగంలో స్పష్టమైన లేబుల్ ఉండాలి. తయారీదారు పేరుండాలి. అవమానపరిచేలా, అనుమతిలేని ఇతరుల స్వరాలు, స్వరూపాలతో ఆడియో, వీడియోలు ప్రచారం చేయరాదు. తప్పుడు కంటెంట్ ఉంటే 3గం.లో హ్యాండిళ్ల నుంచి తొలగిస్తారు. పార్టీలు వీటిపై రికార్డులు నిర్వహించాలి.
News October 25, 2025
చీర కట్టుకుంటున్నారా..? ఇలా చేస్తే సూపర్ లుక్

ఎంత ట్రెండీ, ఫ్యాషన్ డ్రెస్సులున్నా ప్రత్యేక సందర్భాల్లో మహిళలు చీరకే ఓటేస్తారు. అయితే చీర కట్టడంలో కొన్ని టిప్స్ పాటిస్తే లుక్ అదిరిపోతుంది. చీర ఎంత ఖరీదైనా అది మనకు నప్పకపోతే బావుండదు. కాబట్టి మీ ఒంటికి నప్పే రంగు ఎంచుకోవాలి. లైట్ కలర్ చీరైతే మంచి ప్రింట్స్ ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా ఫిట్ అయ్యే బ్లౌజ్ వేసుకోవాలి. అప్పుడప్పుడూ డిఫరెంట్‌గా చీర కట్టడం ట్రై చేయాలి. చీరను బట్టి జ్యువెలరీ ఎంచుకోవాలి.


