News February 15, 2025

HYD: గచ్చిబౌలిలో అవినీతి అధికారి.. రూ. 100 కోట్లు!

image

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన గచ్చిబౌలి ADE సతీశ్ కుమార్ ఇంట్లో ACB సోదాలు ముగిశాయి. శుక్రవారం రూ.50 వేలు తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డాడు. సోదాలు చేపట్టిన ACB ఏకంగా రూ. 100 కోట్ల వరకు స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు అంచనా వేశారు. రెండు రోజులపాటు సోదాలు జరిపి ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించారు. HYD, RR, కరీంనగర్‌లో స్థలాలు, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. సతీశ్‌ను రిమాండ్‌కు తరలించారు.

Similar News

News September 16, 2025

KMR: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కామారెడ్డి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. అదేవిధంగా, కామారెడ్డి, దేవునిపల్లి, దోమకొండ ప్రాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన మరో 8 మందికి కోర్టు మొత్తం రూ.8,000 జరిమానా విధించింది.

News September 16, 2025

సంగారెడ్డి: పాఠశాలల పర్యవేక్షణకు అధికారుల నియామకం

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు రమణ కుమార్‌ను నియమించారని పేర్కొన్నారు. వీరు జిల్లాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించనున్నారని తెలిపారు.

News September 16, 2025

‘షేక్‌ హ్యాండ్’ వివాదంలో పాక్‌కు మరో ఎదురుదెబ్బ!

image

ఆసియా కప్: పాక్ ప్లేయర్లకు సూర్య స్క్వాడ్ షేక్‌ హ్యాండ్ ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అది నిబంధనలకు విరుద్ధమని ICCకి PCB ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని, లేకపోతే UAEతో మ్యాచ్ ఆడమని పాక్ బెదిరించింది. పాక్ బెదిరింపులను ICC తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ‘అందులో మ్యాచ్ రిఫరీ పాత్ర లేదని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని MCC మాన్యువల్‌లో లేదు’ అని ICC తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.