News February 15, 2025

సంగారెడ్డి: పోలీసు దళాలకు మొబిలైజేషన్ కార్యక్రమం

image

సంగారెడ్డిలో సాయుధ పోలీసు దళాలకు మొబిలైజేషన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ.. పర్సనల్ సెక్యూరిటీ అధికారులు వీఐపీ భద్రత విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండడానికి వీలులేదని ఆదేశించారు. రోజు వ్యాయామం చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఏఆర్డిఎస్పి నరేందర్ , సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News April 18, 2026

కర్నూలు: NH-167పై ఈ ప్లేసులు చాలా డేంజర్!

image

NH-167పై పలుచోట్ల మృత్యువు మాటేసింది. తరచూ జరుగుతున్న ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఈ జాతీయ రహదారి కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయం, రాయచూర్ వెళ్లుంది. మధ్యలో కొటేకల్ నగరవరం, ముగతి, చిలకలడోణ, కల్లుదేవకుంట, మాధవరం, చెట్నేపల్లి వద్ద పోలీసులు బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాల కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

News April 18, 2026

HYD: పాలిసెట్ దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్..!

image

పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ దరఖాస్తు గడువు ఈనెల 20వ తేదీతో ముగియనుంది. రూ.100 లేట్ ఫీజుతో 21వ తేదీ వరకు, రూ.300 ఫైన్‌తో 22 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మాసబ్‌ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in

News April 18, 2026

MDK: పాలిసెట్ దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్..!