News March 20, 2024
తిరుపతి జూ నుంచి నల్లమల అడవికి మూడు పులి పిల్లలు

నంద్యాల జిల్లాలో జనావాసాల మధ్య దొరికిన నాలుగు పులి పిల్లలు ప్రస్తుతం తిరుపతి ఎస్వీ జూలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు పులి పిల్లల్ని నల్లమల అభయారణ్యానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేసి పులి పిల్లలకు వేటాడటం నేర్పించేందుకు తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ప్రయోగాత్మకంగా దీనిని చేపట్టారు.
Similar News
News April 1, 2025
చిత్తూరు: టెన్త్ పరీక్షలకు 191 మంది గైర్హాజరు

చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన 10వ తరగతి సోషల్ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. మొత్తం 118 పరీక్షా కేంద్రాల్లో 20,893 మంది విద్యార్థులకు గాను 20,702 మంది పరీక్షలు రాశారని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 31 పరీక్ష కేంద్రాలను చెక్ చేసిందన్నారు. 57 మంది సిట్టింగ్ స్క్వాడ్లు విధులు నిర్వహించారన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని స్పష్టం చేశారు.
News April 1, 2025
వి.కోట : రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

వి.కోట – పలమనేరు ప్రధాన రహదారిలో రాఘవపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి చెందాడు. అతను రామకుప్పం మండలం కంచిదాసనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గురుమూర్తిగా సమాచారం. మంగళవారం ఉదయం రాగువపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. స్థానికులు వి.కోట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News April 1, 2025
చిత్తూరు: నేడు తెరచుకోనున్న బడులు

చిత్తూరు జిల్లాలో నిర్ణయించుకున్న స్థానిక ఐచ్చిక సెలవులు పూర్తిగా వాడుకున్నారని డీఈవో వరలక్ష్మి తెలిపారు. దీంతో మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల యాజమాన్యాలకు ఎలాంటి సెలవు లేదన్నారు. బడులు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పక విధులకు హాజరు కావాలన్నారు. అలాగే టెన్త్ పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.