News March 20, 2024
రాహుల్ గాంధీపై ECకి BJP ఫిర్యాదు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ECకి BJP ఫిర్యాదు చేసింది. ఆయన మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇటీవల ముంబైలో జోడోయాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ ‘హిందుత్వంలో శక్తి అనే పదం ఉంటుంది. అది ఎవరనేదే ఇక్కడ ప్రశ్న. మనం దాంతోనే పోరాటం చేస్తున్నాం. దాని ఆత్మ EVM, ED, CBI, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్లలో నిక్షిప్తమై ఉంది’ అని అన్నారు. దీనిపైనే BJP ఫిర్యాదు చేసింది.
Similar News
News April 4, 2025
పిల్లలకు SM నిషేధ అంశం పార్లమెంట్ పరిధిలోనిది: సుప్రీంకోర్టు

13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది పాలసీ అంశమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై చట్టం చేయాలని పార్లమెంట్‌నే కోరాలని సూచించింది. పిటిషనర్లు సంబంధిత విభాగానికి అర్జీ చేసుకుంటే 8 వారాల్లో పరిష్కరించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.
News April 4, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు రవి కుమార్(71) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1968లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవికుమార్ 150కిపైగా మలయాళ, తమిళ చిత్రాలు, అనేక సీరియళ్లలో నటించారు. ‘అనుబంధం’ సీరియల్‌తో పాటు రజినీకాంత్ శివాజీ మూవీలో మినిస్టర్ పాత్రతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
News April 4, 2025
ఒకేసారి ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రాయితీ

AP: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30లోగా చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.