News February 16, 2025

OTTలోకి వచ్చేసిన కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

image

కిచ్చా సుదీప్ నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మ్యాక్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే ఓటీటీలోకి తీసుకురావడం విశేషం. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం DEC 25న విడుదలై దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో సునీల్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

Similar News

News October 28, 2025

మార్చి మూడో వారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్?

image

TG: పదో తరగతి పరీక్షలను మార్చి మూడో వారం నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. 16 లేదా 18వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తామని ఇటీవల అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసే రెండు రోజుల ముందు టెన్త్ ఎగ్జామ్స్ మొదలవడం ఆనవాయితీగా వస్తోంది.

News October 28, 2025

ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా?

image

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగితేనే కానీ చాలామంది కాలకృత్యాలు పూర్తి చేయలేరు. అయితే ఇదెంతమాత్రం మంచిది కాదంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సుశీల్ శర్మ. ‘టీ, కాఫీలు ముందు పెద్దపేగును కదిలిస్తాయి. తరువాత అదే అలవాటుగా మారి చివరకు పేగుల సహజ రిథమ్‌ను దెబ్బతీస్తాయి. ఆపై పొట్టలో ఇరిటేట్ చేస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు. వాటి బదులు గోరువెచ్చని నీటిని సేవించాలని సూచించారు.

News October 28, 2025

అడుగున ఎరువుకొద్దీ పైన బంగారం

image

ఏ పొలానికైనా ఎరువులే బలం అని చెప్పేందుకు ఈ సామెతను ఉపయోగిస్తారు. పొలం పనులలో భూమికి ఎరువు వేయడం కష్టమైనా, సరైన ఎరువు ఫలితంగా బంగారంలాంటి పంట పండి మనకు సంతోషం కలుగుతుంది. అలాగే, కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ సామెత చెబుతుంది.