News February 16, 2025
VKB: క్రమశిక్షణతో శిక్షణ పొందాలి: ఎస్పీ

క్రమశిక్షణతో కూడిన శిక్షణ భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేస్తుందని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ అధికారులకు 15 రోజుల పాటుగా మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శిక్షణ పొందేందుకు వచ్చిన పోలీస్ అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకుని అన్ని విధాలుగా పరణితి సాధించాలన్నారు.
Similar News
News January 10, 2026
అమరావతిపై జగన్ అడిగింది అదే: సజ్జల

AP: CM CBN చెబుతున్న అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని YCP స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల ఆరోపించారు. ‘పెద్ద భవనాల పేరుతో బడ్జెట్ పెంచుతున్నారు. అంత డబ్బు అవసరమా? అని మాత్రమే జగన్ అడిగారు. అమరావతిపై ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రాజధాని పేరుతో జగన్‌ను దూషిస్తున్నారు. అమరావతి టెండర్లలో కొన్ని కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి సమాధానం చెప్పట్లేదు’ అని విమర్శించారు.
News January 10, 2026
HYD: DANGER.. చిన్నపిల్లలకు ఈ సిరప్ వాడొద్దు

చిన్నపిల్లలకు ఇచ్చే ‘అల్మాంట్-కిడ్’ సిరప్ విషయంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కీలక హెచ్చరిక జారీ చేసింది. బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ ఉత్పత్తి చేసిన ఈ మందులో (బ్యాచ్: AL-24002) ప్రాణాంతకమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల వద్ద ఈ బ్యాచ్ సిరప్ ఉంటే వెంటనే 1800-599-6969 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. దీన్ని తక్షణమే వాడకం నిలిపివేయాలన్నారు.
News January 10, 2026
సుధామూర్తి చెప్పిన పేరెంటింగ్ సూత్రాలు

ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది సవాలుగా మారుతోంది. పిల్లలకు చదువు ఒక్కటే కాదు చాలా విషయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు ఇన్ఫోసిస్ సుధామూర్తి. పిల్లలకు డబ్బు విలువ చెప్పడం, ఎదుటివారిని గౌరవించడం, పుస్తకాలు చదివించడం, సంస్కృతి, సంప్రదాయాల గురించి పిల్లలకు చెప్పడం, పెట్టాల్సిన చోట హద్దులు పెడుతూనే ఇవ్వాల్సిన చోట స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు పిల్లలకు పేరెంట్స్ రోల్‌మోడల్‌లా ఉండాలంటున్నారు.


