News March 20, 2024

ఏఎస్ పేట మండలంలో వాలంటీర్‌పై వేటు

image

ఏఎస్ పేట మండలం చౌటభీమవరం గ్రామ పరిధిలో మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్‌పై వేటు పడింది. ఆ వాలంటీర్ పై పలు సెక్షన్ల పైన కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులకు ఆర్డీఓ మధులత ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Similar News

News March 11, 2026

నెల్లూరు: meesho- ఉమెన్స్ డే గిఫ్ట్ పేరుతో లింకు వైరల్

image

సామాజిక మాధ్యమాల్లో meesho ప్రశ్నావళి అని, ప్రశ్నలకు సమాధానం చెబితే లక్ష వరకు గిఫ్ట్ గెలుచుకోవచ్చని ఓ లింకు వైరల్‌గా మారింది. ఈ లింకును క్లిక్ చేస్తే.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వస్తుంది. ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆఫర్ 12వ తేదీ వరకు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఇలాంటి లింకులను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 11, 2026

మత్స్య పరిశోధన కేంద్రాల స్థాపన కోసం నిధులు ఏర్పాటుపై ఎంపీ ఆరా

image

ఏపీలో అదనపు మత్స్య పరిశోధన కేంద్రాలను స్థాపించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత మూడేళ్లలో కేటాయించిన నిధులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. లోక్‌సభలో మంగళవారం ఈ అంశంపై వివరాలు కోరారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో నాలుగు ప్రాంతీయ మత్స్య పరిశోధన కేంద్రాలు ఉన్నాయన్నారు.

News March 10, 2026

కావలి: మామిడి తోటలో ఉరి వేసుకొని వ్యక్తి మృతి

image

కావలి రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన నూకల పాటి శివప్రసాద్ రెడ్డి (65) మంగళవారం మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి కాంతమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.