News February 16, 2025
జగిత్యాల జిల్లాలో 71 పోలింగ్ స్టేషన్‌లు

జగిత్యాల జిల్లాలో 51 పట్టభద్రుల, 20 ఉపాధ్యాయ పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయని వాటిలో 18 కామన్ పోలింగ్ స్టేషన్‌లు ఉన్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ ఆఫీసర్‌లకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఉన్నారు.
Similar News
News April 18, 2026
రోహిత్, కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన స్మృతి మంధాన

ఉమెన్స్ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డ్ సృష్టించారు. T20Iల్లో(మెన్స్&ఉమెన్స్) అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచారు. స్మృతి 155 ఇన్నింగ్స్‌లో 4,244 రన్స్ చేసి రోహిత్(4,231), కోహ్లీ(4,188)ని వెనక్కి నెట్టారు. రోహిత్ 154, కోహ్లీ 117 ఇన్నింగ్సుల్లో ఈ పరుగులు చేశారు. నిన్న SAతో జరిగిన తొలి T20లో స్మృతి 13 రన్స్ కొట్టి ఈ ఫీట్ సాధించారు. అయితే ఈ మ్యాచులో IND 6 వికెట్ల తేడాతో ఓడింది.
News April 18, 2026
లోక్‌సభ నిరవధిక వాయిదా

లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. మూడు రోజులపాటు సాగిన సమావేశాలు నేటితో ముగిశాయి. నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
News April 18, 2026
గజ్వేల్: భూసార పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చేనా..?

గజ్వేల్ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని 2023 అక్టోబరులో గత ప్రభుత్వంలో హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే దీనికి ఇప్పటికీ సిబ్బంది నియామకం, ల్యాబ్ పరికరాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, తమ భూములను పరీక్షించుకునే వెసులుబాటు కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.


