News February 16, 2025
అంబేడ్కర్ కోనసీమ: 18న పరస్పర అవగాహన సదస్సు

విదేశాలలో వివిధ రకాల ఉద్యోగాలు, ఉపాధిని పొంది కుటుంబాలను పోషించాలనుకునేవారు, విదేశాలకు వెళ్లి మోసపోయిన వారు, విదేశాలకు వెళ్లే వారికి మధ్యవర్తిత్వం వహించే ఏజెంట్లతో ఈనెల 18న పరస్పర అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశం 18వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహిస్తామన్నారు.
Similar News
News November 15, 2025
విజయనగరంలో యాక్సిడెంట్.. వెయిట్‌లిఫ్టర్ మృతి

విజయనగరంలోని YSR నగర్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెయిట్‌లిఫ్టర్ టి.సత్యజ్యోతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు స్కూటీపై వెళ్తున్న ఆమెను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇటీవల స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగానికి సెలక్ట్ అయ్యింది. ఆమె మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
News November 15, 2025
వాంకిడి: ‘విధ్యార్థులకు పౌష్టికాహారం అందించాలి’

ప్రభుత్వ పాఠశాలలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం వాంకిడి(M) ఖమానా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనం నాణ్యత, నిర్వహణ, బోధనా విధానం, హాజరు పట్టికలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలన్నారు.
News November 15, 2025
ASF: మత్స్యకారుల బలోపేతానికి చర్యలు: కలెక్టర్

మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో కొమురం భీం ప్రాజెక్టులో మత్స్యకార సంఘ ప్రతినిధులతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల సంక్షేమంలో భాగంగానే చెరువులు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.


