News February 16, 2025

జగిత్యాల: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో అర్హత ఉన్న నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శనివారం కలెక్టర్‌లో గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీవో, ఎంపీవో, ఏఈడీఈ, పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డీఆర్‌డీవో రఘువరన్ ఉన్నారు.

Similar News

News April 18, 2026

చిన్నారి పునర్విక చికిత్సపై TDP స్పష్టత

image

అరుదైన SMA టైప్-1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్సకు మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్లు స్వయంగా అందించిన విషయంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీడీపీ Xలో ట్వీట్ చేసింది. మొత్తం రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం దాతలు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగతా మొత్తాన్ని లోకేశ్ భరించారని రాసుకొచ్చింది. CMRF నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాన్ని Xలో ఖండించింది.

News April 18, 2026

నేర నియంత్రణే లక్ష్యం: జిల్లా ఎస్పీ

image

పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఎస్పీ సతీశ్ కుమార్ శనివారం జిల్లాస్థాయి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. సమాజానికి హాని కలిగించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని స్పష్టం చేశారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను అభినందించారు.

News April 18, 2026

హైదరాబాద్.. అడుగడుగునా ‘షాందార్’

image

శిలలపై చెక్కిన కావ్యంలా హైదరాబాద్ అడుగడుగునా ‘షాందార్’ అనిపిస్తుంది. చార్మినార్ దర్పం, గోల్కొండ కోట శబ్ద విన్యాసాలు, కుతుబ్ షాహీ సమాధుల కళా వైభవం నగరానికి మణిహారాలు. నిజాంల విలాసానికి ప్రతీక చౌమహల్లా ప్యాలెస్. బన్సీలాల్‌పేట్ మెట్ల బావి కూడా గొప్ప వారసత్వం, సంస్కృతికి సాక్ష్యాలు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. గోల్కొండ, చార్మినార్ గోడలపై పిచ్చి రాతలు వద్దు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.