News February 16, 2025

కరీంనగర్: గనుల శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసిన కలెక్టర్

image

కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి వసతి గృహంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కతో స్వాగతం పలికారు. జిల్లాలో ఇసుక యార్డులు, ఇసుక లారీల బుకింగ్‌లు, నిల్వల వివరాలను జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ఆయనకు వివరించారు.

Similar News

News September 13, 2025

KNR: ప్రజాభవన్ ముట్టడిస్తాం: USFI

image

USFI నగర కమిటీ సమావేశం KNR సిటీలోని ఓ డిగ్రీ కళాశాలలో నగర అధ్యక్షుడు బుస మణితేజ అధ్యక్షతన సమావేశం జరిగింది. USFI రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం విద్యారంగంపై సరైన సదస్సు పెట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

News September 13, 2025

KNR: ‘ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం విషయాలపై అవగాహన వస్తోంది’

image

రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ భవనంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. శుక్రవారం సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం తదితర విషయాలపై అవగాహన వస్తోందన్నారు. మహిళ తనతోపాటు తన పిల్లల పోషణ ఎలా ఉందో తెలుసుకోగలుగుతోందని సూచించారు.

News September 13, 2025

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు: కరీంనగర్ కలెక్టర్

image

జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు.