News February 16, 2025
ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: కడప ఎస్పీ

జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. కడపలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు సిబ్బందికి పలు కీలకమైన సూచనలు చేశారు. అంతకుముందు శిక్షణా కేంద్రంలో ఆయన మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
Similar News
News March 14, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ సివిక్స్ పేపర్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరయ్యారు. నేడు 3,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 3,397 మంది మాత్రమే హాజరయ్యారు. 326 మంది విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు.
News March 14, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,700
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,444
*వెండి 10 గ్రాముల ధర రూ.2,620.
News March 14, 2026
మహిళ ఆత్మహత్య వీడియో వైరల్.. స్పందించిన సజ్జనార్

కళ్లెదుటే <<19370480>>భార్య ప్రాణాలు<<>> తీసుకుంటుంటే.. అడ్డుకొని కాపాడాల్సిన భర్త హేళన చేస్తూ వీడియో తీయడం అత్యంత విచారకరం. సమాజానికి సిగ్గుచేటని HYD సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్వీట్ చేశారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజమని, పంతాలకు పోయి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేదాకా కెమెరా పట్టుకుని చోద్యం చూడడం పైశాచికత్వం అని పేర్కొన్నారు. దయచేసి బంధాలకు విలువనివ్వాలని, క్షణికావేశంలో ఇలా చేస్తే ఆపాలన్నారు.


