News February 16, 2025

కామారెడ్డి: 72 మందికి నియామక పత్రాలు

image

కామారెడ్డి జిల్లాకు చెందిన 72 మందికి డీఎస్సీ 2008 అభ్యర్థులకు శనివారం నియామక ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో 70 మందికి నియామకపు ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అందించారు. సోమవారం నుంచి వారికి కేటాయించిన పాఠశాలల్లో విద్యాబోధన చేస్తారని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మండల విద్యాధికారి వెంకటేశం, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 7, 2025

VZM: కంచం చేత పట్టి లైన్‌లో నిల్చున్న కలెక్టర్

image

గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు బోధన చేయడమే కాకుండా వారితో పాటు కంచం పట్టుకుని లైన్లో నిల్చున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.

News November 7, 2025

బనకచర్ల DPR టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన AP

image

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి DPR కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు AP ప్రకటించింది. HYDలో జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించింది. అంతర్రాష్ట్ర నదీజలాల ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ ఈ ప్రాజెక్టును చేపడుతోందని తెలంగాణ తొలినుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనిపై కేంద్రానికి, CWCకి ఫిర్యాదు చేసింది. న్యాయపోరాటానికీ సిద్ధమైంది. దీంతో AP ఈ ప్రకటన చేసింది.

News November 7, 2025

MBNR: FREE కోచింగ్.. ఫోన్ చేయండి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళలకు ఎస్‌బీఐ, RSETI ఆధ్వర్యంలో ఉచితంగా బ్యూటీ పార్లర్ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. 19 నుంచి 45 ఏళ్లలోపు వారు ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణతోపాటు వసతి కూడా కల్పిస్తారు. పూర్తి వివరాల కోసం 98481 42489 నంబరులో సంప్రదించాలని కోరారు.