News February 16, 2025
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది: PM మోదీ

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘సన్నిహితుల్ని కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని తెలిపారు.
Similar News
News February 21, 2025
రకుల్ సినిమాకు వన్ ప్లస్ వన్ ఆఫర్!

రకుల్ ప్రీత్ సింగ్, భూమీ పెడ్నేకర్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మేరే హస్బెండ్‌కీ బీవీ’. ఈరోజు విడుదల కానున్న ఈ సినిమాకు మేకర్స్ వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించారు. ‘ఛావా’తో పోటీని తట్టుకునేందుకు నిర్మాత ఈ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. అయితే అర్జున్ కపూర్‌కు పెద్దగా ఇమేజ్ లేకపోవడం, రొటీన్ స్టోరీ లైన్, ఛావా దూకుడు మూవీకి మైనస్ కావొచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
News February 21, 2025
ఇవాళ్టి నుంచి టమాటా కొనుగోళ్లు

AP: టమాటా ధరల పతనం నేపథ్యంలో ఇవాళ్టి నుంచి రైతుల పంటను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసింది. అయితే ఏ రేటుతో అనేది వెల్లడించలేదు. ఆ టమాటాను రైతు బజార్లలో విక్రయించనుంది. అవసరం మేరకు పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్లో కేజీ <<15523622>>రూ.4కు చేరిన<<>> విషయం తెలిసిందే.
News February 21, 2025
ఎల్లుండి యాదగిరిగుట్టకు సీఎం

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఆ రోజు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంను కలిసి మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో, అర్చకులు సీఎంకు ఆహ్వానపత్రిక అందించారు.