News February 16, 2025
నా పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ ఖాతాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆయా ఫేస్బుక్ ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ పేరుతో, ఫొటోలతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామన్నారు.
Similar News
News January 11, 2026
నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: వెడ్మ బొజ్జు

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ప్రఖ్యాత నాగోబా ఆలయాన్ని శనివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దర్శించుకున్నారు. స్థానికంగా నిర్వహించే జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ప్రఖ్యాత నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
News January 10, 2026
ఉద్యోగాల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు: ADB SP

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే మూఠా సభ్యులను, డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అలాంటి వారి పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని.. కష్టపడి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలన్నారు. నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
News January 9, 2026
ఆదిలాబాద్: 12న పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో ఈనెల 12న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు అప్రెంటిషిప్ మేళాను సద్వినియోగం చేసుకుంటే చదువుతూనే డబ్బులు సంపాదించవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల్లోని కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.


