News February 16, 2025
మెదక్: రేపటి నుంచి ఆర్థిక సర్వేకు అవకాశం: కలెక్టర్

ఈ నెల 16 నుంచి 28 వరకు సామాజిక, ఆర్టిక, విద్య, ఉపాది, రాజకీయ కుల సర్వే లో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. టోల్ ఫ్రీ, ప్రజాపాలన సేవా కేంద్రాలు, ఆన్లైన్ ఫామ్ డౌన్లోడ్ చేసి సమర్పించడం ద్వారా పాల్గొనవచ్చన్నారు. శనివారం జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ పాల్గొన్నారు.
Similar News
News March 14, 2025
సిద్దిపేట జిల్లాలో బాలిక ఆత్మహత్య

జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2025
హోలీ పిడిగుద్దులాట.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

హోలీ సందర్భంగా శివంపేట మండలం <<15752874>>కొంతాన్‌పల్లి<<>>లో నిర్వహించిన పిడుగుద్దులాటలో ఘర్షణ వాతావరణం నెలకొంది. హోలీని పురస్కరించుకొని ప్రతి ఏటా సంప్రదాయం ప్రకారం పిడితాడు లాగుతూ పిడుగుద్దులాటం ఇక్కడ ఆనవాయితీ. కాగా ఇందులో ఎస్సీ కలకంటి వర్గం పాల్గొంటామని చెప్పడంతో పతందార్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తూప్రాన్ సీఐ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య కార్యక్రమం నిర్వహించారు.
News March 14, 2025
నీటి ఎద్దడిలో రైతులకు సూచనలు.. Way2news స్పెషల్

వేసవి సమీపిస్తున్న వేళ రైతులు పంటలకు తడులు వేసే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఆయన నర్సాపూర్లో Way2newsతో మాట్లాడుతూ.. జిల్లాలో 2,58,487 ఎకరాలో వరి, 8321 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో నీటి ఎద్దడి నేపథ్యంలో రైతుల నీటిని పొదుపుగా వాడుకొని పంటలు సాగుచేసుకోవాలని సూచించారు.