News March 20, 2024
అమేథీలో కాంగ్రెస్‌కు ’21’ గండం తొలగినట్టేనా?

2019 ఎన్నికల్లో కంచుకోట అనుకున్న అమేథీలో ఓటమి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. ’21’ గండం వల్లే ఇలా జరిగిందని ఈసారి గెలుపు పక్కా అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఈ 21 సంఖ్య కాంగ్రెస్‌కు కలిసిరావట్లేదట. 1977లో తొలిసారి అమేథీలో ఓడిపోగా మళ్లీ 21 ఏళ్లకు 1998లో ఓటమిపాలైంది. 21ఏళ్ల తర్వాత మళ్లీ 2019లో ఓడింది. మరోవైపు రాజీవ్ గాంధీ చనిపోయిన తేదీ మే 21 కావడం, అప్పుడు రాహుల్ వయస్సు 21 ఏళ్లు కావడం గమనార్హం.
Similar News
News September 9, 2025
ఐదుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలుకు సిద్ధమైన ACB

TG: ఫార్ములా ఈ-రేస్ <<16712706>>కేసులో<<>> కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ సహా మరో నలుగురిపై న్యాయ విచారణకు ACB సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్‌కుమార్, BLN రెడ్డి, కిరణ్, FEO సీఈవోపై ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందని సమాచారం.
News September 9, 2025
4 దశల్లో స్థానిక ఎన్నికలు: SEC

APలో స్థానిక సంస్థలకు 4 దశల్లో <<17606799>>ఎన్నికలు<<>> జరుపుతామని SEC నీలం సాహ్ని చెప్పారు. మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. EVMలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లో EVMలు వాడారని గుర్తు చేశారు. EVMల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఈ ఉదయం 10 గం. నుంచి సా.5 గంటల వరకు ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 768 ఓట్లు పోల్ అయ్యాయి. సా.6 గం. నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ముగిశాక ఈసీ అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు.