News February 16, 2025

సంగారెడ్డి: పీఎం శ్రీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టండి: కలెక్టర్

image

జిల్లాలో పీఎంశ్రీ కింద 44 పాఠశాలకు విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో ల్యా‌లు, ఎల్ఈడి లైటింగ్, తరగతి గదులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి వంటి సదుపాయాలు కల్పించాలని చెప్పారు. సమావేశంలో డిఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Similar News

News April 17, 2026

నేడు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

image

రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో నిరసన చేపట్టనున్నట్లు వరంగల్ జిల్లా ఛైర్మన్ గజ్జల రామ్ కిషన్ తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల సాధన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరసనకు అనుమతి కోరుతూ అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఫణి కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

News April 17, 2026

యురేనియం ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుంది: ట్రంప్

image

శుద్ధి చేసిన యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. 2 దేశాలు శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని తెలిపారు. ‘వాళ్లు మాకు న్యూక్లియర్ డస్ట్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. ఇరాన్‌తో విజయవంతమైన చర్చలు జరుగుతున్నాయి. డీల్ అయ్యాక స్వేచ్ఛగా చమురు లభిస్తుంది. హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది. ఇస్తామాబాద్‌లో ఒప్పందం జరిగితే నేను పాకిస్థాన్‌కు వెళ్తా’ అని విలేకరులతో అన్నారు.

News April 17, 2026

TU: రేపటి నుంచే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ (BA/BCom/BSc/BBA) 2, 4, 6 రెగ్యులర్, 1, 3, 5 బ్యాక్ లాగ్ (2021-2025 బ్యాచ్ లు) పరీక్షలు ఈ నెల 18 నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. సవరించిన టైం టేబుల్‌ను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు.