News February 16, 2025

మెదక్: ఈనెల 17 నుంచి టెన్త్ ప్రాక్టీస్-2 ఎగ్జామ్స్

image

పదవ తరగతి విద్యార్థులకు ప్రాక్టీస్-2 పరీక్షలు ఈనెల 17 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ నెల 17న తెలుగు, 18న హిందీ, 19న ఇంగ్లీష్, 20న గణితం, 21న భౌతిక రసాయన శాస్త్రం, 22న జీవశాస్త్రం, 24న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.

Similar News

News March 13, 2025

మెదక్‌లో మహిళలు మిస్..

image

మెదక్ పట్టణంలో ఇద్దరు మహిళలు తప్పిపోయారు. వీరిలో… పాపన్నపేట్ మండలం ఎంకేపల్లి చెందిన కందెం నర్సమ్మ (50) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన నీరుడి కిష్టమ్మ (68) అదృశ్యమైంది. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిపారు. ఇరువురు కుటుంబ సభ్యులు మెదక్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పైన తప్పిపోయిన వారి ఆచూకీ లభిస్తే మెదక్ టౌన్ పీఎస్‌లో తెలపాలని ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.

News March 13, 2025

మెదక్: బెస్ట్ ఉమన్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న DRO

image

మెదక్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులను, ఉత్తమ మహిళా ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. అందులో భాగంగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్‌కు కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ అవార్డు అందజేశారు.

News March 13, 2025

మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

image

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

error: Content is protected !!