News February 16, 2025

SVU: 24 నుంచి దూరవిద్య పరీక్షలు ప్రారంభం

image

శ్రీ వెంకటేశ్వర దూరవిద్య (SVU DDE) డిగ్రీ, పీజీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలు ఈనెల 3వ తేదీ నుంచి జరగాల్సింది. అనివార్య కారణాలవల్ల వాయిదా వేశారు. 24వ తేదీ నుంచి జరగనున్నట్లు నూతన షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 8వ తేదీ నుంచి ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని వారు సూచించారు.

Similar News

News July 5, 2025

జిల్లాలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: కలెక్టర్

image

మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమాజానికి చీడ పురుగులా మారిన మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.

News July 5, 2025

కొత్తగా 157 సర్కారీ బడులు

image

TG: రాష్ట్రంలో కొత్తగా 157 ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులకు మించి ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 571 బడులు నెలకొల్పాలని సర్కార్ నిర్ణయించింది. ఈక్రమంలోనే గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూళ్లు వెంటనే తెరవాలని DEOలను ఆదేశించింది. ఫర్నీచర్, విద్యాసామగ్రి, ఇతర ఖర్చులకు బడ్జెట్‌ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనుంది.

News July 5, 2025

త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’

image

AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ప్రభుత్వం త్వరలో NTR బేబీ కిట్లు అందించనుంది. 2016లోనే ఈ పథకం ప్రవేశపెట్టగా మధ్యలో నిలిచిపోయింది. మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచింది. కిట్‌లో దోమ తెరతో కూడిన పరుపు, దుస్తులు, నాప్కిన్లు, సబ్బు, పౌడర్, ఆయిల్ వంటి 11 రకాల వస్తువులు ఉంటాయి.