News February 16, 2025
కరీంనగర్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి KNR, ఆదిలాబాద్, WGL, NZB రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడుపుతున్నామని KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడతో పాటు ఉమ్మడి KNR జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం శైవ క్షేత్రానికి కూడా అదనపు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
భక్తుల కొంగు బంగారం.. కొమ్మాల

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. చుట్టూ పచ్చని పొలాలతో గుట్టపై ఈ దేవాలయం ఉంది. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఈ ఆలయంలో ప్రతియేటా హోలీ సందర్భంగా జాతర జరుగుతుంది. మిగతా రోజుల్లోనూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడి రైతులు తొలి పంటను స్వామివారికి అందిస్తుంటారు.
News July 6, 2025
వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలలకు కొత్త భవనాలు

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలల్లో అదనంగా నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. గీసుగొండ మండలం నందనాయక్ తండా, నర్సంపేట మండల బోజ్యానాయక్ తండా, చిన్న గురజాల, పార్శ్య నాయక్ తండా, స్వామి నాయక్ తండాల్లో ఏర్పాటు చేయనున్న నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమావేశంలో డీఈవోను ఆదేశించారు.
News July 6, 2025
జగిత్యాల: మిస్టరీగా 5 ఏళ్ల చిన్నారి మృతి!

కోరుట్లలోని <<16959055>>5 ఏళ్ల చిన్నారి మృతి <<>>కేసు మిస్టరీగా మారింది. అభం శుభం తెలియని బాలిక హితీక్ష ప్రమాదవశాత్తు మరణించిందా లేదా హత్య చేశారా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. అయితే నిన్న సాయంత్రం పెద్దపులుల విన్యాసాలు చూసేందుకు మిత్రులతో కలిసి వెళ్లిన చిన్నారి భయంతో బాత్రూంలో దాక్కోగా కాలుజారి అక్కడే ఉన్న నల్లాపై పడి చనిపోయిందనే అనుమానమూ వ్యక్తమవుతోంది. బాలిక తండ్రి రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటున్నారు.