News February 16, 2025
కీచక హెచ్ఎం మల్లేశ్వర్‌పై సస్పెన్షన్ వేటు

నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరులోని మండల ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న బీ.మల్లేశ్వర్‌ను విద్యాశాఖ ఉన్నతాధికారులు శనివారం సాయంత్రం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కారణంగా ఆయనను విధుల నుంచి తొలగిస్తున్నట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
Similar News
News April 18, 2026
నెల్లూరు: ఉద్యోగులకూ సమస్యలు

నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే శుక్రవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వివరించారు. ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు 4 శుక్రవారాలు ఉద్యోగుల గ్రీవెన్స్ డే చేపట్టగా.. 235 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 172 పరిష్కారించారు.
News April 18, 2026
మారని కోల్‘కథ’.. ఇక ఇంటికేనా?

IPL 2026లో KKR పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 6 మ్యాచుల్లో 5 ఓడగా, వర్షం వల్ల ఒకటి రద్దయింది. ఇంకా 8 మ్యాచులు మిగిలి ఉండటంతో కనీసం 7 గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం టీమ్ ఆట తీరు చూస్తే అది అనుమానమే. ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా అనేలా తయారైంది పరిస్థితి. అసాధారణ రీతిలో పుంజుకుంటే తప్ప ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం దాదాపు అసాధ్యం. మీరేమంటారు?
News April 18, 2026
గాడిదలా నటించమని అడిగినా సరే..: ఆర్య

దర్శకులు బాల, పా.రంజిత్‌ను తాను ఎంతో నమ్ముతానని తమిళ హీరో ఆర్య చెప్పారు. వాళ్లతో సినిమాలకు స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు. ‘నాకు కథ చెప్పకుండానే వెట్టువమ్ మూవీని రంజిత్ తీస్తున్నారు. బాల సర్ నన్ను గాడిదగా చేయమన్నా సరే చేసేస్తా. నెల రోజుల్లో అఘోరీ లుక్(నేనే దేవుడ్ని) కోసం సిద్ధమవ్వాలని చెప్పి నన్ను హీరోగా సెలక్ట్ చేశారు’ అని ‘మిస్టర్ ఎక్స్’ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పారు.


