News February 16, 2025
పోలవరం: మెడికల్ సబ్ యూనిట్ అధికారి మృతి

పోలవరానికి చెందిన ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు బొంగు నాగేశ్వరరావు శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ నాగేశ్వరరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నాగేశ్వరరావు మృతి సంఘానికి తీరని లోటు అని కొనియాడారు. నాగేశ్వరరావు పోలవరం మెడికల్ సబ్ యూనిట్ ఆఫీసర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Similar News
News November 8, 2025
ఎటపాక: ఉసురు తీసిన చీటీల అప్పులు

అప్పుల బాధతో చీటిల వ్యాపారి గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల మేరకు..ఎటపాకకు చెందిన బాల్యా(60) పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. రూ. కోట్లలో అప్పుల పాలవడంతో ఈ సూసైడ్‌కు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.
News November 8, 2025
హైదరాబాద్ మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌవరం

మిథాలి రాజ్.. హైదరాబాదీ మాజీ క్రికెటర్.. మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన గొప్ప క్రీడాకారిణి. వివిధ మ్యాచ్‌లో గెలిపించి భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న బ్యాట్స్ ఉమెన్.. ఇప్పడు మిథాలికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో జరిగిన సమావేశంలో మిథాలికి ఐసీసీ ఉమెన్ క్రికెట్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 8, 2025
బరువు తగ్గేందుకు విపరీతంగా మందులు వాడేస్తున్నారు.. జాగ్రత్త!

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు చాలామంది భారతీయులు ఓ డయాబెటిస్ ఔషధాన్ని వాడుతున్నట్లు తేలింది. దీంతో మన దేశంలో వీటి అమ్మకాలు గత నెలలో ₹100 కోట్ల వరకూ జరిగాయి. అయితే ఈ మందులు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడానికి జీవనశైలిలో సరైన మార్పులు (పోషకాహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ) ప్రధానమని సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు వాడాలంటున్నారు.


