News February 16, 2025

మన ఖమ్మం విత్తనాలు రాష్ట్రాలు చుట్టేస్తున్నాయ్..!

image

సాగులో మందుల వినియోగం తగ్గించేందుకు నాణ్యమైన ఉత్పత్తితో 400 రకాల విత్తనాలను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌కు చెందిన రైతు మన్నేపల్లి రవి. సాగుపై ఇష్టంతో ఇంజినీరింగ్ చదివిన కుమారుడు హర్షతో కలిసి తన పొలంతో పాటు 300 ఎకరాలను కౌలుకు తీసుకొని విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. పురుగు మందుల వినియోగం అవసరం లేని విత్తనాలను ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని వారు అంటున్నారు.

Similar News

News November 7, 2025

ఖమ్మంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖానాపురం హవేలీ పోలీసుల కథనం ప్రకారం.. గోపాలపురంలోని కశ్మీర్ దాబా ఎదురుగా అర్ధరాత్రి ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

News November 7, 2025

ఖమ్మం: వందేమాతరం గీతాలాపనలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.శ్రీజ మాట్లాడుతూ.. కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.

News November 7, 2025

ఖమ్మం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘వందే మాతరం’

image

జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో వందే మాతరం జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.