News February 16, 2025
ధీరుని వీరత్వ చిహ్నం.. గొల్లగట్టు జాతర

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగన్నజాతర. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లింగమంతుల స్వామి జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. వందల ఏళ్ల కింద తన జాతి ఉనికిని.. తమ వారి పశుసంపదను క్రూరమృగాల నుంచి, ఇతర తెగల నుంచి నిత్యం పోరాడుతూ కాపాడిన ధీరుని వీరత్వ చిహ్నమే ఈ జాతర. ఒ లింగా.. ఓ లింగా.. అంటూ జనం గుండెలు చేసే శబ్దాలతో ఐదురోజులు ఈ ప్రాంతం దద్దరిల్లుతుంది. మరి మీరు జారతకు వెళ్తున్నారా..?
Similar News
News January 16, 2026
ఎల్.ఎన్.పేట: పండగపూట విషాదం.. యువకుడు మృతి

ఎల్.ఎన్.పేట(M) మోదుగువలస నిర్వాసితుల కాలనీకి చెందిన సాయికుమార్(25) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భోగి రోజు సాయికుమార్ మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ స్కాట్ పేట వద్ద నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొని కిందపడ్డారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి తెలిపారు.
News January 16, 2026
BREAKING: ఫ్లిప్‌కార్ట్, మీషో, అమెజాన్‌కు షాక్

చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్నందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మెటా వంటి ఈకామర్స్ సంస్థలపై CCPA కఠిన చర్యలు తీసుకుంది. ఒక్కో సంస్థకు ₹10 లక్షల చొప్పున జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ దాటిన వైర్‌లెస్ పరికరాలకు లైసెన్స్, ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్ (ETA) తప్పనిసరి. ముందస్తు అనుమతులు లేదా లైసెన్సింగ్ సమాచారం లేకుండానే వీటిని విక్రయించినట్లు తేలింది.
News January 16, 2026
పాపవినాశనం రోడ్డుపై భారీగా వాహనాలు

తిరుమలలో పార్వేట ఉత్సవం ఇవాళ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాపవినాశనం తీర్థానికి వెళ్లేందుకు భక్తులను విజిలెన్స్ సిబ్బంది అనుమతించ లేదు. గోగర్భం సమీపంలోని గేటు వద్ద సిబ్బంది వాహనాలను అడ్డుకున్నారు. ఆక్టోపస్ భవనం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉత్సవాల కారణంగా వాహనాల అనుమతి కుదరదని విజిలెన్స్ అధికారులు భక్తులకు తెలియజేశారు. పాపనాశనం, ఆకాశంగంగకు అనుమతించాలని భక్తులు కోరుతున్నారు..


