News February 16, 2025
వరంగల్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి వరంగల్ రీజియన్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వరంగల్-1 డిపో నుంచి 21 బస్సులు, హనుమకొండ 27, మహబూబాబాద్ 30, నర్సంపేట 30, పరకాల 24 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 9, 2025
ములుగు: గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేట నిషేధం

జిల్లాలో భారీ వర్షపాతం నమోదైందని, గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు గోదావరిలో చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజ్ తెలిపారు. చేపలు గుడ్లు పెట్టి పిల్లలు చేసే జులై, ఆగస్టు మాసంలో చేపల వేట నిషిద్ధమని తెలిపారు. చెరువులు మత్తడి పోస్తున్నప్పుడు మత్తడి ప్రాంతంలో సిమెంటు దిమ్మెలు, ఇనుప జాలీలు, కర్రలు, వలలు పెట్టడం వల్ల చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు
News July 9, 2025
గోదావరిఖని: సింగరేణి ఆర్జీ-1లో 3,303 మంది విధులకు దూరం

దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా సింగరేణి ఆర్జీ-1లో బుధవారం రెండు షిఫ్టుల్లో 3,303 మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఫస్ట్ షిఫ్ట్‌లో 3,169 మంది ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉండగా, 2,556 మంది గైర్హాజరయ్యారు. కేవలం 490 మంది హాజరు కాగా, అటెండెన్స్ 15.46% నమోదైంది. సెకండ్ షిఫ్ట్‌లో 883 మంది రావాల్సి ఉండగా, 747 మంది గైర్హాజరయ్యారు. 207 మంది హాజరు కాగా, అటెండెన్స్ 23.44% నమోదైంది.
News July 9, 2025
HYDలో గంజాయి కేసులో జిల్లా వాసి అరెస్ట్

గంజాయి కేసులో జిల్లా వాసి HYDలో అరెస్ట్ అయ్యాడు. మోత్కూర్‌కు చెందిన కొంతం నితిన్(చింటు) JNTU సమీపంలో ఉండి చదువుకుంటున్నాడు. HYDలో ఉండే ప్రధాన నిందితుడు యనగల నరేందర్, నితిన్ స్నేహితులు. మత్తు పదార్థాలకు బానిసై ఒరిశా నుంచి గంజాయి తెచ్చి LBనగర్‌లో మెట్రో వద్ద పట్టుబడ్డారు. వారి నుంచి 1,182 గ్రా. గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకొని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని LB నగర్ CI వినోద్ కుమార్ తెలిపారు.