News February 16, 2025

రాజుపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం  

image

రాజుపాలెం మండలం నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న ఓ కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి,ఇద్దరు కుమారులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News November 14, 2025

భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే

image

బిహార్‌లో భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం వెల్లడైన ట్రెండ్స్‌లో 180+ సీట్లలో ముందంజలో ఉంది. ఎంజీబీ 59 సీట్లు, జేఎస్పీ 1, ఇతరులు 3 సీట్లలో లీడింగ్‌లో ఉన్నారు. జన్ శక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ 8,800 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మహువా స్థానంలో 1500 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: రౌండ్ల వారీగా ఆధిక్యాలు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో మొదటి 5 రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.
*ఫస్ట్ రౌండ్ మెజారిటీ: 47 ఓట్లు
*రెండో రౌండ్ మెజారిటీ: 2,947 ఓట్లు
*మూడో రౌండ్ మెజారిటీ: 3,100 ఓట్లు
*నాలుగో రౌండ్ మెజారిటీ: 3,100 ఓట్లు
*ఐదో రౌండ్ మెజారిటీ: 3,178 ఓట్లు
> 5 రౌండ్లు కలిపి 12వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించిన నవీన్ యాదవ్.

News November 14, 2025

65L ఓట్లు డిలీట్ చేశాక ఫలితాల్లో ఇంకేం ఆశిస్తాం: మాణిక్కం ఠాగూర్

image

బిహార్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘65 లక్షల ఓట్లను డిలీట్ చేశారు. అందులోనూ ప్రతిపక్షాలకు మద్దతిచ్చే ఓటర్లవే ఎక్కువ. అలాంటప్పుడు ఫలితాల రోజు ఇక ఏం ఆశిస్తాం. ఇలాంటి పరిస్థితులతో ప్రజాస్వామ్యం మనుగడ సాధించదు’ అని పేర్కొన్నారు. #SIR, #VoteChori హాష్‌ట్యాగ్స్ యాడ్ చేశారు. కాగా ఇప్పటిదాకా వెల్లడైన ట్రెండ్స్‌లో ఎన్డీయే 160+ సీట్లలో ముందంజలో ఉంది.