News February 16, 2025

NLG: ఈ సండే.. చికెన్‌కు దూరమేనా?

image

ఆదివారం వచ్చిందంటే ఇండ్లల్లో నాన్-వెజ్ వంటలు ఘుమఘుమలాడుతుంటాయి. ఇక ఉమ్మడి NLG జిల్లాలో అయితే ఆదివారం చికెన్, మటన్ షాపుల ముందు క్యూలు కడతారు. వారం అంతా డ్యూటీలు, ఇతర పనులతో బిజి బిజీగా ఉండే జిల్లా వాసులు సండే ఓ ముక్క అలవాటుంటే సాయంత్రం ఓ చుక్క వేసుకుంటారు. అయితే బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో చికెన్ ప్రియులు ఈ ఆదివారం చికెన్‌కు దూరంగా ఉంటున్నారు.

Similar News

News September 17, 2025

నిజాం ఒక్కడు కాదు.. ఒక వంశం

image

అసఫ్ జా వంశానికి చెందిన రాజులే ఈ నిజాంలు. 1724లో హైదరాబాద్‌లో వీరి పాలన మొదలై, 1948 వరకు (225 ఏళ్లు) పాలించారు. నిజాం చెప్పిందే రాజ్యాం.. చేసింది చట్టం. వీరిలో నిజాం ఉల్ ముల్క్(1724-1748) మొదటివాడు. నిజాం అలీఖాన్(1762-1802), నాసిర్ ఉద్దౌలా ఫర్జుందా అలీ(1829-1857), అఫ్జల్ ఉద్దౌలా మీర్ టెహ్షియత్ అలీ ఖాన్(1857-1869), ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్(1869-1911), ఇక చివరి వాడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(1911-1949).

News September 17, 2025

నిర్మల్: స్వచ్ఛతాహి సేవ పోస్టర్ల ఆవిష్కరణ

image

నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజయ్య స్వచ్ఛతాహి సేవ పోస్టర్లను ఈరోజు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తదితరులు ఉన్నారు.

News September 17, 2025

వ్యాధులు రాకుండా పరిక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

image

అసంక్రమిత వ్యాధులు రాకుండా మహిళలు ముందస్తుగా వైద్య పరిక్షలు చేయించుకోవాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ ప్రజలకు బుధవారం పిలుపునిచ్చారు. జిల్లాలో స్వస్థ్ నారీ.. సశక్తి పరివార్ అభియాన్ కింద 18 సంవత్సరాలు నిండిన మహిళలందరూ తప్పని సరిగా క్యాన్సర్ స్కీనింగ్ పరిక్షలు చేయించుకోవాలన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిక్షలు చేస్తారన్నారు.