News February 16, 2025

MBNR: నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం.!

image

నాలుగేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన ఘటన MBNRలో శనివారం జరిగింది. స్థానికుల ప్రకారం.. ఓ కాలనీకి చెందిన ఖాజా(50) చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతడి పక్కింట్లో ఉంటే బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఇదిగమనించిన చిన్నారి తల్లి అరవడంతో స్థానికులు చేరుకుని అతడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడు పారిపోయాడు. పోక్సో కేసు నమోదైంది.ది.

Similar News

News February 27, 2026

ఎప్‌స్టీన్ ప్రకంపనలు.. దిగ్గజాల రాజీనామా

image

ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలు పదవులకు రాజీనామా చేస్తున్నారు. WEF CEO బోర్జ్ బ్రెండే, హార్వర్డ్ మాజీ ప్రెసిడెంట్ లారెన్స్ సమ్మర్స్, నోబెల్ గ్రహీత రిచర్డ్ ఆక్సెల్ తమ పదవుల నుంచి వైదొలిగారు. గోల్డ్‌మన్ శాక్స్ లీగల్ ఆఫీసర్ క్యాథీ రూమ్లెర్, హయత్ హోటల్స్ వారసుడు థామస్ ప్రిట్‌జ్కర్, DP వరల్డ్ ఛైర్మన్ సుల్తాన్ అహ్మద్, నార్వే అంబాసిడర్ మోనా కూడా ఈ లిస్టులో ఉన్నారు.

News February 27, 2026

విజయవాడ: లాడ్జిలలో వ్యభిచారం

image

విజయవాడలోని గవర్నర్ పేటలో లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. ఓ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఇద్దరు విఠులను అరెస్ట్ చేసి నలుగురు మహిళలను వ్యభిచార కూపం నుంచి విడిపించినట్లు సీఐ నాగమురళి తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహిళలను సంరక్ష కేంద్రానికి పంపించామన్నారు.

News February 27, 2026

సూసైడ్ గురించి సెర్చ్ చేస్తే పేరెంట్స్‌కు అలర్ట్

image

పిల్లలు సూసైడ్ లేదా సెల్ఫ్-హార్మ్ వంటి పదాలతో ఇన్‌స్టాలో సెర్చ్ చేస్తే.. వెంటనే పేరెంట్స్‌కు అలర్ట్ వెళ్లేలా కొత్త ఫీచర్‌ వచ్చింది. పేరెంట్స్ సూపర్విజన్ టూల్స్ వాడుతున్న వారికి ఈ నోటిఫికేషన్లు వాట్సాప్ లేదా SMS రూపంలో వెళ్తాయి. ప్రస్తుతం US, UK వంటి దేశాల్లో మొదలైన ఈ ఫీచర్ 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. పిల్లలను కౌన్సెల్ చేసేలా నిపుణుల సలహాలనూ ఇన్‌స్టా అందిస్తుంది.