News February 16, 2025

బీటెక్ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు బీఎఫ్ఎస్ఐ – స్కిల్లింగ్ కోర్సు: మంత్రి శ్రీధర్ బాబు

image

గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్ల‌లో (జీసీసీ) తెలంగాణ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ద‌క్కేలా ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుంటుంద‌ని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉద్యోగాలు కోసం ప్ర‌య‌త్నిస్తున్న ప‌ట్ట‌భ‌ద్రులు స్కిల్స్ యూనివ‌ర్సిటీ వెబ్ సైట్‌ ( yisu.in ) త‌ర‌చూ సంద‌ర్శించాల‌ని మంత్రి సూచించారు. ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొత్త కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామని మంత్రి తెలిపారు.

Similar News

News October 27, 2025

ADB: ఆర్టీసీ బస్సుల్లో క్యాష్ లెస్ పేమెంట్స్

image

టీజీఎస్ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఇదివరకు సూపర్ లగ్జరీ, గరుడ, రాజధాని బస్సుల్లో మాత్రమే టికెట్ల కోసం ఆన్‌లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసేవారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా డిజిటల్ చెల్లింపులకు అవకాశం లభించింది. ADB- NRML-NZB రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సులో ఆన్‌లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. త్వరలో అన్ని బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

News October 27, 2025

KNR: నేడే LUCKY ‘డ్రా’ప్.. ఎంట్రీపాస్ MUST..!

image

2025 DEC 1- 2027 NOV 30 వరకు మద్యంషాపులు నిర్వహించేందుకు టెండర్‌దారులు సిద్ధమయ్యారు. ఇవాళ ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మద్యం టెండర్లకు సంబంధించి ‘లక్కీ డ్రా’ తీయనున్నారు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఎంట్రీపాసులు ఉంటేనే లోనికి అనుమతిస్తారు. ఫోన్లను పర్మిషన్ లేదు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 287 షాపులకు 7,584 దరఖాస్తులు రాగా.. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.228 కోట్ల ఆదాయం వచ్చింది.

News October 27, 2025

అమ్మాయిలు గూగుల్‌లో వెతికే టాప్-5 టాపిక్స్!

image

ఇండియన్ టీనేజీ అమ్మాయిలు గూగుల్‌లో వినోదం మాత్రమే కాకుండా తమ పర్సనల్ లైఫ్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు పలు నివేదికల్లో తేలింది. బ్యూటీ&మేకప్(35%), ఫ్యాషన్ (25%), కొరియన్ డ్రామాలు(18%), హెల్త్&ఫిట్నెస్(12%), స్టడీస్&కెరీర్(10%) టాపిక్స్ గురించి అధికంగా శోధిస్తున్నారు. ఇక ఇతరులను అడగలేని సున్నితమైన సమస్యలకు సమాధానాల కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నట్లు తేలింది.