News February 16, 2025
పల్నాడు: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

రాజుపాలెం (మ) నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దృశ్యాలు అక్కడి వారందరిని కలిచి వేశాయి
Similar News
News March 20, 2025
ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచడం లేదు: కేంద్ర మంత్రి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సులో ఎటువంటి మార్పులు చేయట్లేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కొన్ని రంగాల్లో రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలుంటే మరికొన్నిచోట్ల 65గా ఉందని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ అనేది స్టేట్స్కు సంబంధించిందని అన్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాలు ఉండగా గత ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది.
News March 20, 2025
వల్లంపట్ల అమ్మాయికి 70వ ర్యాంక్

ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన దొడ్ల లిఖిత బుధవారం విడుదలైన గేట్ పరీక్ష ఫలితాలలో 70వ ర్యాంకు సాధించారు. ఇదివరకే లిఖిత దిల్లీలో డీఆర్డీవోలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ గేట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యి 70వ ర్యాంకు సాధించారు. ర్యాంకు సాధించిన లిఖితకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News March 20, 2025
బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రధానిని కలుస్తాం: మంత్రి

TG: బీసీ రిజర్వేషన్ల అమలుకోసం అఖిలపక్షంతో వెళ్లి ప్రధానిని కలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోదీ అపాయింట్ మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదేనని మంత్రి అన్నారు. BC రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు పెడితే కేటీఆర్‌కు అభ్యంతరాలెందుకని మంత్రి ప్రశ్నించారు.