News March 20, 2024
అదిరిపోనున్న ఐపీఎల్ ప్రారంభ వేడుకలు
ఐపీఎల్ సీజన్-17 ఆరంభానికి సిద్ధమైంది. రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ నెల 22న ఆర్సీబీ, సీఎస్‌కే జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, సోను నిగమ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. ఎల్లుండి సా.6.30 నుంచి లైవ్ ప్రారంభంకానుంది.
Similar News
News November 25, 2024
మాజీ MLA రామచంద్రారెడ్డి కన్నుమూత
TG: సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ MLA డి. రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ సమకాలికులైన ఈయన 1985లో దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) నుంచి TDP ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి వద్దే ఉంటున్నారు. స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక.
News November 25, 2024
ప్చ్.. ఆర్సీబీ మళ్లీ అంతే!
RCB మేనేజ్‌మెంట్ తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్స్ మనీ ఎక్కువగా ఉన్నా మంచి ప్లేయర్లను కొనుగోలు చేయలేదని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్‌కు రూ.12.50 కోట్లు చాలా ఎక్కువ అని.. స్టార్క్, షమీ, నటరాజన్ లాంటి బౌలర్లను కొనాల్సిందంటున్నారు. ప్రస్తుతం RCBలో సుయాశ్ శర్మ, యశ్ దయాల్, రసిక్ సలాం లాంటి సాధారణ బౌలర్లే ఉన్నారు. మరి ఇవాళ RCB ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో చూడాలి.
News November 25, 2024
దివ్యాంగుల పోస్టులపై కేంద్రం మార్గదర్శకాలు
దివ్యాంగులకు పోస్టులను కాలానుగుణంగా గుర్తించడానికి కమిటీలను తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కనీసం 40% వైకల్యం ఉన్న వ్యక్తులకు రిజర్వేషన్లు, పోస్టుల గుర్తింపును క్రమబద్ధీకరించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా పోస్టు వారికి సరిపోతుందని భావిస్తే, తదుపరి ప్రమోషనల్ పోస్టులు దివ్యాంగులకు రిజర్వ్ చేయాలని తెలిపింది. వైకల్య నిర్ధారణకు ఏకరీతి మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.