News February 16, 2025
కంకిపాడు: వాకింగ్‌కి వెళ్లిన వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కంకిపాడు మండలం ప్రొద్దుటూరు శివారు కొనతనపాడులో ఉంటున్న వెంకటస్వామి ఈనెల 14న రాత్రి వాకింగ్‌కి వెళ్లి తిరిగి రాకపోవడంతో భార్య కొందరితో కలిసి సాయంత్రం వెతకగా రోడ్డు పక్కన చనిపోయి కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 16, 2026
భర్త మరణం తట్టుకోలేక.. భార్య కన్నుమూత

కృష్ణాజిల్లా గూడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కప్పలదొడ్డికి చెందిన తిరుమలశెట్టి వీర రాఘవరావు (66) అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య పద్మావతి (61) కొద్దిసేపటికే స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె కూడా ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News April 15, 2026
టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు

టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు మరోసారి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. గతంలో పొలిట్ బ్యూరో మెంబర్లుగా పని చేసిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకులైన వర్ల రామయ్యను మరోసారి పొలిట్ బ్యూరో మెంబర్లుగా నియమించారు. జగ్గయపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను కూడా పొలిట్ బ్యూరో మెంబర్‌గా నియమించారు. తాతయ్య గతంలో టీడీపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు.